Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam : శ్రీశైలం సమీపంలో చిరుత దాడి.. చిన్నారిని ఈడ్చుకెళ్లిన వైనం

Srisailam : శ్రీశైలం సమీపంలో చిరుత దాడి.. చిన్నారిని ఈడ్చుకెళ్లిన వైనం

Srisailam : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుతపులి దాడి ఘటన కలకలం రేపింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఈ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతుల మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది. నల్లమల అడవి నుంచి వచ్చిన చిరుత, తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లింది. తండ్రి అంజయ్య కేకలు వేస్తూ వెంబడించడంతో చిరుత భయపడి గ్రామ శివారులో చిన్నారిని ముళ్లపొదల్లో వదిలేసి పారిపోయింది.

- Advertisement -

ALSO READ: Rains: అల్పపీడనం.. ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

 ‎ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని నల్లమల అడవిలో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారం పెరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెంచు గిరిజనులు 70 ఏళ్లకు పైగా ఈ గ్రామంలో నివసిస్తున్నప్పటికీ, ఐటీడీఏ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గురువారం ఉదయం దోర్నాల-శ్రీశైలం రహదారిపై ఆర్టీసీ బస్సులు, వాహనాలను అడ్డుకొని గంటపాటు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీ, పోలీసు అధికారులు గ్రామానికి చేరుకొని చెంచులతో చర్చించి, ఆందోళనను శాంతింపజేశారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తులు రాత్రిపూట జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad