యాదగిరిగుట్టలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దంపతులు.
- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, తుంగ బాలు, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

