వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జైలులో వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి వంశీని పోలీసులు విచారిస్తున్నారు.
వల్లభనేని వంశీని ఒక రోజు పోలీస్ కస్టడీకి శుక్రవారం గన్నవరం కోర్టు అనుమతించింది. ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో వంశీపై కేసు నమోదైంది. ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనూ అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే. ఈ రెండు కేసుల్లోనూ ఏప్రిల్ 9వరకు రిమాండ్ విధించారు.