Sunday, November 16, 2025
HomeAP జిల్లా వార్తలుTuraka Kishore: పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌కు రిమాండ్

Turaka Kishore: పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌కు రిమాండ్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌(Turaka Kishore)కు మాచర్ల జూనియర్ సివిల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న కారుపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ దాడి పెద్ద సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

- Advertisement -

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిశోర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి తీసుకొచ్చి మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో అతడిని జిల్లా జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad