ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం, విద్యాశాఖ CBSE తరహాలో మార్పులు చేయాలని ఆలోచిస్తుంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా సెంకడ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు పెట్టాలని నిర్ణయం తీసుకోనుంది. దీనిబట్టి విద్యార్థులు మొదటి ఏడాది పరీక్షలు రాయకుండా రెండవ సంవత్సరంలోకి అడుగు పెడతారు. కేవలం సెకండ్ ఇయర్‌లో పరీక్షలు రాసే వెసులుబాటు ఉంటుంది.
ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు వారి చదువులో సమయం ఆదా అవుతుందని, పరీక్షలకు ఎక్కువ సమయం కేటాయిస్తారని అంచనా వేస్తోంది. ఈ కొత్త విధానంతో విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని, విద్యార్థులు ఇంకా మెరుగ్గా చదువుతారని భావిస్తుంది.
ఫస్టియర్ పరీక్షల ప్లేస్‌లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకురావాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. అంటే, విద్యార్థులు వారి తరగతిలో ప్రదర్శన ద్వారా మార్కులు సంపాదిస్తారు. దానిబట్టి వారికి మార్కులు వస్తాయి. వీటిని సెకండ్ ఇయర్‌లో కలుపుకోవచ్చు. కానీ, ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయలు తీసుకుని తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఈ నిర్ణయం ఇంకా అమలి లోకి రాలేదు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యర్థనలు లేకపోతే ఇదే కొనసాగే అవకాశం ఉంటుంది.