Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBakasura Restaurant: ‘బకాసుర రెస్టారెంట్‌’ టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన అనీల్ రావిపూడి

Bakasura Restaurant: ‘బకాసుర రెస్టారెంట్‌’ టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన అనీల్ రావిపూడి

Praveen – VIVA Harsha: తెలుగు సినీ ప్రపంచంలో చిన్న సినిమాలకు పెద్ద అండగా నిలిచే స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందిస్తోన్న మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరోసారి ఆయన తన పెద్ద మనసుని చాటుకున్నారు. తాజాగా, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘బకాసుర రెస్టారెంట్’ అనే ఆకట్టుకునే చిత్రానికి సంబంధించిన టైటిల్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది!

- Advertisement -

హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తనదైన నటనతో, పంచులతో ప్రేక్షకులను అలరించే క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఈ చిత్రంలో వైవా హర్ష (Viva Harsha) టైటిల్ రోల్‌లో నటిస్తుండటం విశేషం. ఇంకా ఈ చిత్రంలో కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ వంటి పలువురు ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో ఎస్‌జే శివ అనే యువ దర్శకుడు పరిచయం అవుతున్నారు.

ALSO READhttps://teluguprabha.net/cinema-news/actress-priyanka-chopra-telugu-movies-before-ssmb-29/

ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ టైటిల్ ర్యాప్ సాంగ్ విషయానికి వస్తే, వికాస బడిస స్వరాలు సమకూర్చగా, ర్యాప్ సింగర్ రోల్ రైడ్ మరియు వికాస బడిస స్వయంగా ఆలపించారు. ఈ పాట విన్న తర్వాత అనిల్ రావిపూడి స్వయంగా, “బకాసుర రెస్టారెంట్ అనే టైటిల్‌తో పాటు ఈ పాట కూడా చాలా కొత్తగా, బాగుంది. ఈ సినిమా ఐడియా ఎంతో అద్భుతంగా ఉంది” అని ప్రశంసించారు. తన తొలి రోజులు నుండీ ప్రవీణ్ తనకు తెలుసని, ఆయన హీరోగా వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad