OG Movie: డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి బంపరాఫర్ అందుకున్నది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నది. పవన్ సినిమాలో నటిస్తున్న విషయాన్ని నేహాశెట్టి స్వయంగా వెల్లడించింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్న నేహా శెట్టిఈ సీక్రెట్‌ను బయటపెట్టింది. అయితే ఓజీలో తన క్యారెక్టర్ గురించి మాత్రం నేహాశెట్టి రివీల్ చేయలేదు. సినిమాలో చూడాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చింది.
స్పెషల్ సాంగ్…
ఓజీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో నేహాశెట్టి ఆడిపాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐటెంసాంగ్‌తో పాటు కొన్ని సీన్స్‌లోనూ నేహాశెట్టి కనిపిస్తుందని అంటున్నారు. లెంగ్త్ తక్కువే అయినా చాలా సర్‌ప్రైజింగ్‌గా ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. డీజే టిల్లులో రాధికగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది నేహాశెట్టి. ఆ తర్వాత రూల్స్ రంజన్, బెదురులంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. టిల్లు స్క్వేర్‌లో గెస్ట్ రోల్ చేసింది.
Also Read- Pawan Kalyan: రుషికొండ భవనాల్లో భారీ అవినీతి, ఆడిట్ చేయాలి: డిప్యూటీ సీఎం పవన్
పవన్ కెరీర్‌లో హయ్యెస్ట్…
కాగా ఓజీ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా లీజ్ కాబోతుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై మెగా అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వరల్డ్ వైడ్‌గా రెండు వందల కోట్లకుపైనే జరిగింది. 160 కోట్లకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోన్న మూవీగా ఓజీ నిలిచింది.
ఓవర్‌సీస్‌లో…
ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తక్కువ టైమ్‌లోనే 17000లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. రిలీజ్‌కు ఇంకా ఇరవై నాలుగు రోజుల వరకు టైమ్ ఉండటంతో ఓవర్‌సీస్‌లో కలెక్షన్స్ పరంగా ఓజీ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఓజాస్ గంభీర…
ఓజీ మూవీలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ఓజీ మూవీతోనే ఈ బాలీవుడ్ సీనియర్ హీరో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అర్జున్ దాస్, శ్రేయారెడ్డి, వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read- Anchor Vishnu Priya: హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్న విష్ణు ప్రియ
ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత…
ఓజీ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫైర్ స్ట్రోమ్‌తో పాటు సువ్వి సువ్వి అనే పాటలు రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ ఇదే.


