Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభSuryakantham: 'సూర్యకాంతం' శతజయంతి.. 'గయ్యాళి అత్త' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Suryakantham: ‘సూర్యకాంతం’ శతజయంతి.. ‘గయ్యాళి అత్త’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Suryakantham| అలనాటి నటి సూర్యకాంతం గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ అప్పటి తరానికి ఆమె నటన అంటే ఎంతో ఆసక్తి, భయం. తెరపై ఆమెను చూడగానే ‘గయ్యాళి అత్త’ వచ్చిందిరా అని భయపడేవారు. ఆమె గొంతు కూడా ఆనాటి ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తిండిపోతుంది. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాల్లో గయ్యాళి పాత్రలు పోషించినా.. నిజజీవితంలో మాత్రం ఆమె మనసు మాత్రం వెన్నలాంటిది. అవసరంలో ఉన్న ఎంతో మందికి దానాలు చేశారు. నేడు సూర్యకాంతం(Suryakantham) శతజయంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబరు 28న సూర్యకాంతం జన్మించారు. పాఠశాల దశ నుంచే ఆమె నాటకాల్లో నటించేవారు. అలా సినిమాల మీద కూడా ఆసక్తి పెరిగతింది. ఈ క్రమంలోనే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ‘చంద్రలేఖ’సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ జెమినీ నిర్మాణ సంస్థ ఇచ్చిన పేపర్ ప్రకటన చూసి మద్రాసు రైలెక్కారు. అలా ఆమె సినీ ప్రయాణం మొదలైంది.

1946లో వచ్చిన ‘నారద నారది’ సినిమా ద్వారా సూర్యకాంతం తొలిసారిగా వెండితెరపై కనిపించారు. అయితే ఆ సినిమాలో ఆమె చిన్న పాత్రనే పోషించారు. 1950లో విడుదలైన ‘సంసారం’ సినిమాలో గయ్యాళి పాత్ర పోషించారు. ఆ పాత్రలో ఆమె అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో దాదాపు మూడు దశాబ్దాల పాటు గయ్యాళి అత్త, అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ‘మాయా బజార్‌’, ‘కుల గోత్రాలు’, ‘మంచి మనసులు’, ‘రక్త సంబంధం’, ‘అందాల రాముడు’, ‘యమగోల’. ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె సందడి చేశారు.

1962లో దిగ్గజ నటులు ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) కలిసి నటించిన చిత్రానికి సూర్యకాంతం పాత్ర ఆధారంగా ‘గుండమ్మ కథ’ అనే టైటిల్ పెట్టడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాకు గయ్యాళి అత్త పాత్రలు పోషించే సూర్యకాంతం పాత్ర పేరుతో సినిమా టైటిల్ పెట్టడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. చివరగా 1994లో నటించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఎస్పీ పరుశురామ్’ చిత్రంలో నటించారు. అయితే అదే ఏడాది డిసెంబర్ 18న అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.

కాగా సూర్యకాంతం తొలుత హీరోయిన్‌గానే నటించాలనుకున్నారు. కానీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో ఆమె ముక్కుకు గాయమైంది. దీంతో క్లోజప్‌ షాట్స్‌లో ముక్కు మీద గాయం మచ్చ కనిపిస్తే బాగోదనుకున్నారు. అందుకే హీరోయిన్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు.

గుంటూరుకు చెందిన న్యాయవాది పెద్దిబొట్ల చలపతిరావును ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈయన వివాహం తర్వాత హైకోర్టు జడ్జిగానూ పనిచేశారు. అయితే ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో సూర్యకాంతం తన అక్క కుమారుడిని దత్తత తీసుకున్నారు. అంతగా చదువుకుపోయిన సూర్యకాంతం మరాఠీ, ఫ్రెంచి భాషలు నేర్చుకున్నారు. అంతేకాదు ఆమె చివరి రోజుల్లో తిరుపతి మహిళా యూనివర్సీటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News