Thursday, April 10, 2025
Homeనేరాలు-ఘోరాలుChevella: ఊట బాయికి ఈతకు పోతె ఊపిరి పోయె

Chevella: ఊట బాయికి ఈతకు పోతె ఊపిరి పోయె

బావిలో పూడికలో కూరుకుపోయి..

చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవులు ఇవ్వడంతో బడి పిల్లలు సొంత గ్రామాలకు చేరారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతున్న నేపథ్యంలో మండుటెండలతో ఇంట్లో ఉండలేక స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రాణం పోయింది. స్నేహితులతో కలిసి వ్యవసాయ ఊట బావిలోకి ఈతకెళ్లిన ఆ విద్యార్థి కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎదురే నాని తండ్రి విట్టలయ్య వయసు 16 సంవత్సరాలు 10వ తరగతి పూర్తి చేశాడు. వ్యవసాయ ఊట బావిలో పూడిక తీయకపోవడం ఆ బావిలో ఈతకెళ్లిన యువకుడు నాని బురదలో చిక్కుకొని చనిపోయారని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News