Saturday, May 11, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ..

Garla: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ..

సీజ్ చేసి, కేసు..

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని గార్ల ఎస్ఐ జీనత్ కుమార్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని మర్రిగూడెం గ్రామానికి వెళ్లే శివారులో ఎస్సై జీనత్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించి, టూవీలర్ వాహనదారులకు అవగాహన కల్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు ముందు వెనక నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. లేని పక్షంలో వాహనాలను సీజీ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్యామ్ మంగీలాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News