Shani Dev Impact On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్మఫలదాత శని ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించిన శని.. ఇక్కడే 2027 వరకు ఉండనున్నాడు. శని యెుక్క ఈ రాశి మార్పు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది. శక్తివంతమైన యోగం కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో వెలుగులు విరాజల్లుతాయి. ఆ రాశులు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మీనరాశి
ఇదే రాశిలోనే శనిదేవుడు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని చేయబోతున్నాడు. న్యాయదేవుడు చేసే ఈ యోగం మీనరాశి వారికి ఎనలేని లాభాలను తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లోన్ని మీ గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగం లేని వారికి జాబ్ వస్తుంది. ఖాళీగా ఉన్నవారికి ఉపాధి దొరుకుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కడంతోపాటు శాలరీ కూడా పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు ఎన్నడూ చూడని లాబాలను చూస్తారు మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉండనుంది.
మకర రాశి
శనిదేవుడి శుభదృష్టి మకరరాశి వారికి లాభిస్తుంది. రాబోయే రోజుల్లో మీ దశ తిరగబోతుంది. అనుకోని శుభవార్తలు వింటారు. మీ కెరీర్ లో ఊహించని విజయాలను చూస్తారు. గతంలో జరిగిన పరాభవాల నుంచి బయటపడతారు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారాలు లాభిస్తాయి. మీ ఉద్యోగ స్థానంలో మార్పు వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. భార్యభర్తలు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సంతానసౌభాగ్యం కలుగుతుంది. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న మీ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. కర్మఫలదాత ఆశీస్సులతో మీరు కోరుకున్నది సాధిస్తారు.
మిథున రాశి
కేంద్ర త్రికోణ రాజయోగ మిథునరాశి వరమనే చెప్పాలి. ఊహించనంత ధనం, లాభాలను చూస్తారు. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి సుఖంగా ఉంటారు. శని శుభ దృష్టి వల్ల మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది. వివాహం ఫలవంతమవుతుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని దంపతులకు సంతానం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి విజయాన్ని చేకూరుస్తుంది.


