Sunday, November 16, 2025
HomeదైవంRajyog: 12 ఏళ్ల తర్వాత పవర్ పుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్...

Rajyog: 12 ఏళ్ల తర్వాత పవర్ పుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్..

MahaDhani Rajyog 2025 effect: ఆస్ట్రాలజీ ప్రకారం, నెలకొకసారి సూర్యభగవానుడు తన రాశిచక్రాన్ని మారుస్తాడు. సంవత్సరం మెుత్తం మీద ఆదిత్యుడు 12 రాశుల్లోనే సంచరిస్తూ ఉంటాడు. ఇతడిని ఆత్మ, తండ్రి, గౌరవం, విజయం మరియు ఆరోగ్యానికి కారకుడిగా భావిస్తారు. నేడు అంటే నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే వృశ్చిక సంచారం అంటారు. ఈ క్రమంలో భాస్కరుడు మహాధాని రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. ఈ యోగం చాలా ప్రత్యేకమైనది మరియు శక్తివంతమైనది. ఈ మహాధాని రాజయోగం వల్ల మూడు రాశులవారి అదృష్టం తెరుచుకోబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

- Advertisement -

తులా రాశి
సూర్య సంచారం తులా రాశి వారి తలరాతను మార్చబోతుంది. మీరు చేపట్టే ప్రతి పని లేదా ప్రాజెక్టులో విజయం మిమ్మల్నే వరిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది. మీ జీతం అమాంతంగా పెరిగిపోతుంది. కెరీర్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతారు. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుని భారీ లాభాలను ఆర్జిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీవైపే ఉంటుంది.

సింహరాశి
మహాధాని రాజయోగం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మీ పనిని నలుగురు మెచ్చుకుంటారు. ఆఫీసులో మీ బాస్ తోపాటు సహచరుల సపోర్టు కూడా లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కోరిక నెరవేరుతోంది. మీ బాధ్యతలు పెరుగుతాయి.

Also Read: Ekadashi 2025 -అప్పులతో బాధపడుతున్నారా? అయితే ఈ ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు..!

వృషభ రాశి
సూర్యుడు చేయబోతున్న మహాధాని రాజయోగం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతోంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఉద్యోగ యోగం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోతుంది. కెరీర్ లో అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. లక్ కూడా మీకు తోడుంటుంది. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad