Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Badusha Sweet: బాదూషా చాలా ఈజీ

Badusha Sweet: బాదూషా చాలా ఈజీ

చిన్నా-పెద్దా అందరూ ఇష్టంగా తినే బాదుషాలు ఒక్కసారి చేసి నిల్వపెట్టుకుంటే ఇక కొన్ని రోజులపాటు మీకు స్నాక్స్ కొరతే ఉండదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసే బాదుషాను మీరు ట్రై చేసే విధానం మేం మీకు షేర్ చేస్తున్నాం..
కావాల్సిన పదార్థాలు..
మైదా– 11/2 కప్పులు
బేకింగ్‌ సోడా– చిటికెడు
ఉప్పు– చిటికెడు
నెయ్యి– 1/4 కప్పు
నీరు– 1/4 కప్పు
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

- Advertisement -

షుగర్‌ సిరప్‌ తయారీకి..
చక్కెర– 3/4 కప్పు
నీరు– 1/2 కప్పు
యాలకుల పొడి– 1/4 టేబుల్‌ స్సూన్స్‌
కుంకుమ పువ్వు– కొద్దిగా.

తయారీ విధానం..
మైదా , బేకింగ్‌ సోడా, ఉప్పు ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో నెయ్యి వేసుకుని కలపాలి. తర్వాత నీటిని చల్లుకుంటూ, మెత్తగా పిండిని పిసికి కలుపుకోవాలి. పిండి మెత్తగా అయ్యే వరకు పిసికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిపై తడి గుడ్డను కప్పి 30 నిమిషాలు నానబెట్టాలి. మరో గిన్నె తీసుకుని కుంకుమపువ్వును నీటిలో నానబెట్టుకోవాలి.


ఇప్పుడు షుగర్‌ సిరప్‌ను రెడీ చేసుకోవాలి. దీనికి బాండ్లీలో నీళ్లు పోసి పంచదార వేసి బాగా కలిపి మరిగించాలి. తీగపాకం అయ్యాక చివరగా కుంకుమపువ్వు నీరు, యాలకుల పొడిని పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు పిండిని మరోసారి పిసికి, పైభాగంలో నీట్‌గా ఉండేలా చుట్టుకోవాలి. పిండిని చపాతి పిండి ముద్ద సైజులో తీసుకుని గుండ్రంగా చేసుకుని మధ్యలో చూపుడు వేలితో మధ్యలో ఒక రంద్రం పెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజులో పిండిని తీసుకుని చదునుగా వత్తుకోవాలి. తర్వాత బాండ్లీలో నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఈ పిండి ముద్దలను అందులో వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్‌ మంట కూడా మీడియంలో ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ముద్దలు మాడిపోతాయి. మీడియం మంట మీద బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకుంటే, బాదుషాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వాటిని అలాగే, పంచదార పాకంలో డిప్‌ చేసుకోవాలి. 5–10 నిమిషాలు నానబెట్టి బాదుషాను తీసివేయాలి. ఇంకేముంది తీయని బాదుషా రెడీ..వీటిపై కాస్త బాదం పలుకులు చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News