Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Jilebi: ఓట్స్ జిలేబీలు ఎలా చేయాలి?

Jilebi: ఓట్స్ జిలేబీలు ఎలా చేయాలి?

మనం సౌత్ ఇండియాలో జిలేబీ అంటాం.. నార్త్ ఇండియాలో వీటిని జలేబీ అంటారు. పలకటం ఎలా ఉన్నా జిలేబీలు ఆరోగ్యానికి మంచివి. సీజన్ ఏదైనా జిలేబీలు మోషన్స్ ను కంట్రోల్ చేస్తాయి. పైగా మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. పెరుగుతో, రబ్జీతో ఇలా మనకు నచ్చిన వాటితో జిలేబీ తినచ్చు. ఎప్పటికప్పుడు వేడిగా కరకరలాడే జిలేబీలు నిల్వ ఉంచేలా చేసుకోవచ్చు. ఇన్స్టంట్ జిలేబీ, హర్యానా జిలేబీ, కోవా జిలేబీ, ఓట్స్ జిలేబీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలున్నాయి ఇందులో. సంప్రదాయక వంటల్లో జిలేబీ ఎప్పుడూ ముందుంటుంది.

- Advertisement -

జిలేబీలను రెండు రకాలుగా తయారు చేయవచ్చు. ఒకటి సంప్రదాయ విధానం .. రెండోది ఇన్స్‌స్టంట్ పద్దతిలో అప్పటికప్పుడు చేయటం. ట్రెడిషనల్ మెథడ్‌లో చేయాలంటే జిలేబీ తయారీ కోసం మైదా, పెరుగు కలిపి 24 గంటలపాటు పులియబెట్టాలి. అదే ఇన్స్‌స్టంట్ గా వచ్చేసరికి జిలేబీ పిండిని ఈస్ట్ వేసి తయారు చేస్తారు. కానీ సంప్రదాయ పద్ధతిలో చేసే జిలేబీకి రుచి చాలా ఎక్కువ. రెండు పద్ధతుల్లో ఏరకంగా చేసినా జిలేబీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.

3 ముఖ్యమైన స్టెప్స్

జిలేబీ తయారీలో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఇంట్లో చేసుకోవాలనుకుంటే ముందు జిలేబీ పిండిని సంప్రదాయ పద్ధతి లేదా ఇన్స్టంట్ పద్ధతిలో తయారు చేసుకోవాలి. రెండవ స్టెప్ లో భాగంగా పాకం తయారు చేసుకోవాలి, ఇక చివరి స్టెప్ లో కాలే నూనెలో జిలేబీ చుట్లను పిండటం, డీప్ ఫ్రై చేసి, కరకరాలడేలా తీసి, గోరువెచ్చిన పాకంలో ముంచాలి.

కావలసిన పదార్థాలు

½ కప్పు మైదా
1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్
చిటికెడు పసుపు పొడి (పసుపు రంగు వచ్చేందుకు)
¼ కప్పు పెరుగు
¼ కప్పు నీరు

పాకం తయారీకి కావాల్సిన పదార్థాలు

½ కప్పు చక్కెర
¼ కప్పు + 2 టేబుల్ స్పూన్ వాటర్
1 టీస్పూన్ నిమ్మరసం
చిటికెడు యాలకుల పొడి
కావాలనుకుంటే 5-7 కుంకుమ పువ్వు

జలేబీ పిండి తయారీ విధానం:
జల్లెడ పట్టుకున్న ½ కప్పు మైదా పిండిని మీడియం బౌల్ లో తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ¼ టీస్పూన్ బేకింగ్ పౌండర్, చిటికెడు పసుపు, ¼ కప్పు పెరుగు వేసి కలపాలి.
ఈ మిశ్రమానికి తగినంత నీరు కలిపి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇది వడ పిండిలా ఉండాలి. ఉండలు లేకుండా పిండి బాగా కలుపుకోవాలి. పిండిపై మూత పెట్టి రూమ్ టెంపరేచర్ వద్ద 24 గంటలపాటు పిండిని పులియడానికి వదిలేయాలి. మరుసటి రోజు మూత తీసి చూస్తే పిండిపై చిన్న గాలి బుడగలు ఉండి, కాస్త పులిసిన వాసన వస్తుంది. కానీ ఇడ్లీ పిండిలా ఇది ఒదుగు మాత్రం రాదు.
గరిటతో ఈ పిండిని బాగా కలపాలి. పిండి కాస్త జారుడుగా ఉండాలి. కానీ ఎక్కువ పల్చగా అయితేమాత్రం జిలేబీ కరకరలాడుతూ ఫ్లాట్ గా ఉంటుంది. పిండి బాగా గట్టిగా ఉండే జిలేబీ సాఫ్ఠ్ గా లావుగా వస్తుంది.ఖాళీగా ఉన్న కెచప్ బాటిల్ లోకి లేదా జిలేబీ మేకర్ లోకి ఈ పిండిని పోయండి. లావుగా ఉన్న జిప్ లాక్ బ్యాగు అందుబాటులో ఉంటే అందులోకి అయినా ఈ పిండిని వేసుకోవచ్చు.

పాకం పట్టే విధానం
చక్కెర, కుంకుమ పువ్వు రెక్కలు, యాలకుల పొడి, నీరు వీటన్నింటినీ..లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలో పోయాలి. మీడియం మంటపై దీన్ని పాకం పట్టాలి. తీగ పాకం వచ్చే వరకు దీన్ని కలియబెడుతూ ఉండాలిఒక తీగ పాకం వచ్చాక కొంచెం నిమ్మరసం వేయాలి. బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆర్పేయాలి. జిలేబీ తయారీ కోసం అవసరమైన పాకం రెడీ అయినట్టే. కానీ జిలేబీలు ఈ పాకంలో వేసేటప్పుడు మళ్లీ పాకాన్ని గోరువెచ్చగా చేయాలి.
జిలేబీలు చేయటం
వెడల్పాటి బాణలిలో నెయ్యి లేదా నూనె పోసి వేడి చేయాలి. మీడియం మంటపై జిలేబీలను డీప్ ఫ్రై చేయాలి. నూనెతో చేసినప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి డీప్ ఫ్రై చేస్తే ఇవి రుచిగా ఉంటాయి. నూనె కాగాక డైరెక్ట్ గా నూనెలోకి జిలేబీలను చుట్టలుగా పిండాలి. ఎక్కువ చుట్టలు చుడితే విరిగిపోతాయి కనుక 2-3 చుట్టలు పిండితే సరిపోతుంది. ఒకవేళ చుట్టల ఆకారం సరిగ్గా రాకపోయినా బాధపడకండి, ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ మీద మాత్రమే వస్తాయి. జిలేబీలు గుండ్రంగా లేకపోయినా రుచిలో మార్పు ఏం రాదు కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు.
లేత బంగారు రంగు వచ్చేవరకు వీటిని డీప్ ఫ్రై చేయండి. అప్పుడు జిలేబీ కరకరలాడుతుంది.
ఇలా వేగాక నూనెలో నుంచి తీసి వెంటనే గోరువెచ్చని పాకంలోకి వేయండి.. ఇలా 2 నిమిషాలు పాకంలో నానాక తిరగేసిన జిలేబీని ఒక నిమిషం పాటు పాకంలో నాననివ్వాలి.

పాకం నుంచి జిలేబీని తీసేయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టండి. అంతే రుచికరమైన జిలేబీ తినేందుకు ఇక సిద్ధమైనట్టే.

ఓట్స్ జిలేబీ

కావలసినవి:
ఓట్స్‌ – 1 కప్పు
గోధుమ రవ్వ – అర కప్పు
నీళ్లు – సరిపడా
బెల్లం కోరు – 2 కప్పులు
ఉప్పు – చిటికెడు
ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (జిలేబీ కలర్‌)
నూనె లేదా నెయ్యి – 1 కప్పు

తయారీ:
ముందుగా ఓట్స్, గోధుమ రవ్వలను మిక్సీ బౌల్లో వేసుకుని.. ఒక కప్పు నీళ్లు పోసుకుని.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు, కొద్దిగా ఫుడ్‌కలర్‌ వేసుకోవాలి.
కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని కోన్‌ లాంటి ఖాళీ టొమాటో సాస్‌ టిన్‌లో నింపి పెట్టుకోవాలి.
ఈ లోపు స్టవ్‌ మీద కళాయిలో బెల్లం కోరు, ఒక కప్పు నీళ్లు పోసుకుని.. లేత పాకం వచ్చే వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.
మరో స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. మరో కళాయిలో నెయ్యి లేదా నూనెలో ఓట్స్‌ మిశ్రమాన్ని జిలేబీల్లా వేస్తూ దోరగా వేయించుకోవాలి. వెంటనే వాటిని బెల్లం పాకంలో వేసి దేవుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News