Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Mysore Pak: మైసూర్ పాక్ ఇష్టమా?

Mysore Pak: మైసూర్ పాక్ ఇష్టమా?

స్వీట్స్ అంటే బాగా ఇష్టపడేవారికి ఫేవరెట్ స్వీట్స్ లో మైసూర్‌పాక్‌ తప్పకుండా ఉంటుంది. మరి మీరు ఇంట్లో మైసూర్ పాక్ తయారు చేసుకోవాలంటే ఎలాగో సింపుల్ విధానం ఇస్తున్నాం.. ఇంకేం.. ట్రై చేయండి..

- Advertisement -

తయారీకి కావాల్సిన పదార్ధాలు:
శనగపిండి – కప్పు
పంచదార – కప్పు
నెయ్యి – కప్పు కంటే ఎక్కువ
నీరు – అర కప్పు

తయారీ విధానం:
ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. అప్పుడు శనగ పిండిలో ఎటువంటి ఉండలు.. మొరం లేకుండా మొత్తగా వస్తుంది. దానిని మైసూర్ పాక్ తయారీకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టి వెలిగించి, సిమ్ లో పెట్టి ఈ శనగపిండి వేసి పచ్చి వాసన పోయి , కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకూ శనగపిండిని కలుపుతూ వేయించాలి. వేగిన శనగపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని. అందులో కరిగిన నెయ్యి వేసి బాగా కలుపుతూ జారుగా ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టి.. మళ్ళీ స్టవ్ మీద బాండ్లీ పెట్టి సిమ్ ఫ్లేమ్ లో ఉంచి అరకప్పు నీళ్ళు పోసి .. కప్పు పంచదార వేసి కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగి బాండ్లీలో మిశ్రమం ఉడుకు వస్తుంది. ఒక చుక్క చూపుడు వేలిమీద వేసుకుని బొటన వేలితో నొక్కితే సన్నటి తీగ ఫార్మ్ అయ్యేవరకూ పంచదార పాకం పట్టి.. అందులో శనగపిండి మిశ్రమాన్ని వేయాలి. తరవాత పంచదార పాకంలో వేసిన మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో మిగిలిన నెయ్యి రెండేసి చెంచాలు వేస్తూ .. అలా కలుపుతూ ఉండాలి. శనగపిండి పంచదార మిశ్రమం బాండ్లీకి అంటకుండా అటూ ఇటూ కదులుతూ నెయ్యి తేలుతూ ఉంటుంది. అంటే మైసూర్ పాక్ తయారీ పూర్తి కావడానికి వచ్చింది అన్న మాట. కొంచెం మిశ్రమం తీసుకుని వేలితో తీసి నలిపితే గుండ్రంగా గింజలా కూడా అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి.. రెడీ అయ్యిన మైసూర్ పాక్ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసుకుని.. ఎటువంటి బబుల్స్ లేకుండా సమానంగా సర్ధాలి.. కొంచెం సేపు అలా వదిలేస్తే.. చల్లారుతుంది. తర్వాత ఒక చాకు తో నచ్చిన షేప్స్ లో కట్ చేసుకుంటే మైసూర్ పాక్ రెడీ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News