Sunday, July 7, 2024
Homeహెల్త్Belly fat: పొట్ట తగ్గించే చిట్కాలు

Belly fat: పొట్ట తగ్గించే చిట్కాలు

చాలామంది అధిక పొట్టతో బాధపడుతుంటారు. దాన్ని తగ్గించుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతుంటారు. దీనికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.
 ఒట్స్, జొన్నలు, ఉలవలు, పెసలు, కందులు , నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, పొట్ల, ఆనపకాయ వంటి కూరలు తినాలి.  ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలతో చేసే వంటలకు దూరంగా ఉండాలి. మితంగా భోజనం చేయాలి.
 భోజనానికి అరగంట ముందు నీళ్లు బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల ఆకలి ప్రభావం తగ్గుతుంది. భోజనం చేసిన రెండుగంటల తర్వాత నుంచి ప్రతి అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి.
 రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటుండాలి. కప్పుడు అన్నంతో పాటు ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు తినాలి. ఆకలి అనిపిస్తే పచ్చికేరట్ లేదా యాపిల్ పండు తింటే మంచిది.

- Advertisement -

 గోరు వెచ్చని నీటిలో స్పూను తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా బాగా నీటిని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు పోతాయి.
 ఉదయమే గ్రీన్ టీ తాగాలి. దానిమ్మ జ్యూసు తప్ప మిగతా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
 అధిక బరువును అరికట్టే పదార్థం బార్లీ గింజలు. ఈ బార్లీ గింజలను గంజిలా చుకుని తాగడం ద్వారా అధికబరువు తగ్గుతాం. ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
 పగటి నిద్రకు దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయాలి. పొట్టను తగ్గించే, కాలేయం సరిగా పనిచేసేలా చేసే ఆసనాలు ఉంటాయి. వాటిని యోగ నిపుణుల వద్ద అభ్యసించి నిత్యం చేస్తే మంచిది. వీటితో కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. కొవ్వు కూడా బాగా తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News