ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా లాభాలను కలిగిస్తుంది. ఈ ప్రక్రియను జపాన్ వంటి కొన్ని దేశాల్లో “వాటర్ థెరపీ”గా పిలుస్తారు. ఇలా ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల వచ్చే లాభాలను తెలుసుకుందాం.
పాచిక తగ్గించడం: రాత్రి నిద్రలో నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఉండే బాక్టీరియా, అవి శరీరానికి కొన్ని విధాలుగా ఉపయోగ పడతాయి. బ్రష్ చేయకుండానే నీళ్లు తాగడం ద్వారా అవి శరీరానికి అందుతాయి.
డిటాక్సిఫికేషన్: తెల్లవారు జామున నీళ్లు తాగడం శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి శరీరాన్ని శుభ్రం చేస్తుంది.
మలబద్ధకం నివారణ: ఉదయాన్నే నీళ్లు తాగడం మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను చక్కబెట్టడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం: శరీరంలో టాక్సిన్లు తగ్గిపోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది చర్మంపై మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాత్రంతా నిద్రలో శరీరం కొంత మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఉదయాన్నే నీళ్లు తాగడం ద్వారా శరీరానికి తగిన హైడ్రేషన్ అందుతుంది. మెటాబాలిజం వేగంగా జరుగుతుంది. ఇది వెయిట్ లాస్‌కు దోహదపడుతుంది.
మెదడు చురుకుదనం: నీటిని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల మెదడుకు తగిన ఆక్సిజన్ అందుతుంది. దాంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ఇది సాధారణమైన అలవాటుగా మార్చుకుంటే మీ శారీరక ఆరోగ్యం బలంగా ఉంటుంది. కానీ, దీన్ని ప్రారంభించే ముందు మీ శరీరానికి మంచిది కాదని భావిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కానీ మంచి నీటిని మాత్రమే తాగండి. ఆపైన క్రమం తప్పకుండా బ్రష్ చేయడం మరచిపోవద్దు.