Coffee For Skin: కొందరు టీ, కాఫీ తాగనిదే రోజు గడవదు. కొందరు టీ తాగితే, మరికొందరు కాఫీ తాగడానికి ఇష్టపడుతారు. అయితే, ఆరోగ్యపరంగా కాఫీ మంచిదా కాదా అనే దానిపై చాలామందికి ఎన్నో సందేహాలు ఉండడం కూడా వింటుంటాం. వాటిల్లో ఒకటి కాఫీ తాగడం చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనే అనుమానం చాలామందిలో చూస్తాం. ఇది ఎంతవరకూ నిజం? దీనిపై వైద్య నిపుణులు ఆసక్తికరమైన విషయాలు చెపుతున్నారు.న్యూట్రిషనిస్ట్ లవనీత్ బాత్రా దీనిపై కొన్ని లోతైన వివరాలను చెపుతున్నారు.చాలామంది కాఫీని ఇష్టపడడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొందరు అందులోని కెఫైన్ ఇచ్చే ఉత్సాహం కోసం కాఫీ తాగుతుంటారు. మరికొందరు మెటబాలిజం బాగా పనిచేసేందుకు సహకరిస్తుందని కాఫీ సేవిస్తుంటారు.
అయితే, ఇటీవల చాలా మంది కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇది చర్మంపై చూపే పాజిటివ్ ప్రభావం చూపుతుందని! అయితే, ఇది చర్మానికి మంచిదన్నది ఎంతవరకూ నిజం? దీనిపై పోషకాహారనిపణురాలు లవనీత్ బాత్రా ఆసక్తికర విషయాలను తన ఇన్స్టా లో పంచుకున్నారు. నిజానికి కాఫీ తాగడం వల్ల పాజిటివ్, నెగిటివ్ ప్రభావాలు రెండూ చర్మంపై పడతాయని లవనీత్ తెలిపారు. కాఫీలోని యాంటాక్సిడెంట్లు చర్మం దెబ్బతినకుండా సంరక్షించడమే కాదు ఏజింగ్ బారిన తొందరగా పడకుండా కూడా సంరక్షిస్తాయి. కాఫీలోని యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో సాంత్వననిస్తాయి. అలా అని కాఫీని ఎక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కు దారితీస్తుందని లవనీత్ వివరించారు. పరిమిత పరిమాణంలో కాఫీని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుపులు చిందిస్తుందన్నారు.
Also read: Ghee Coffee Benefits: నెయ్యి కాఫీ తాగడం మంచిదే కానీ..అలాంటి వారికి మాత్రం కాదు..
మరి మెరిసే చర్మం కోసం కాఫీని పూర్తిగా మానేయడం మంచిదా? అనే ప్రశ్న కూడా వస్తోంది. కాఫీని పరిమితంగా తాగితే ఇబ్బంది లేదు కానీ కాఫీ ఎలా తాగుతున్నారన్నది కూడా కీలకమని లవనీత్ అంటున్నారు. కాఫీలో పాలు, చక్కెర జోడిస్తే శరీరంలోని ఇన్సులిన్ ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. ముఖ్యంగా డయిరీ ఉత్పత్తులు పడనివారిపై, అలాగే హై గ్లైసమిక్ ఫుడ్స్ తీసుకునే వారిలో ఈ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరిస్తున్నారు. అంతేకాదు విపరీతంగా కాఫీ తాగడం వల్ల కోర్టిసాల్ ప్రమాణాలు కూడా బాగా పెరుగుతాయి. దీంతో యాక్నే తీవ్రత బాగా ఎక్కువవుతుంది. కాబట్టి, కాఫీని మోడరేట్ స్థాయిలో తాగడం వల్ల చర్మంపై దుష్ప్రభావం పడదు. కాఫీ ప్రియులు అనుసరించాల్సిందల్లా కాఫీని పరిమితంగా తాగితే చాలు అని లవనీత్ బాత్ర అంటున్నారు.


