Sunday, November 16, 2025
Homeహెల్త్Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌పై ఆహార 'అస్త్రం'.. ఈ సూపర్ ఫుడ్స్‌తో గుండె పదిలం!

Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌పై ఆహార ‘అస్త్రం’.. ఈ సూపర్ ఫుడ్స్‌తో గుండె పదిలం!

Foods to lower bad cholesterol:  మన శరీరంలో గుట్టుచప్పుడు కాకుండా తిష్ట వేసి, గుండెకు ముప్పు తెచ్చే ‘సైలెంట్ కిల్లర్’ అధిక కొలెస్ట్రాల్. వ్యాయామంతో దీనికి కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగినా, అసలైన మార్పు మన పళ్లెంలోనే మొదలవ్వాలని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. రక్తనాళాల్లో పేరుకుపోయి ప్రమాద ఘంటికలు మోగించే ఈ చెడు కొలెస్ట్రాల్ (LDL)ను కరిగించే శక్తి మన వంటింట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలకే ఉందని ఆధునిక అధ్యయనాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏవి..? మన గుండెకు రక్షణ కవచంలా నిలిచే ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు : మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అవకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థం పుష్కలంగా ఉండే అవకాడో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గింజలు (నట్స్): బాదం, వాల్‌నట్స్, వేరుశనగ వంటి గింజలు గుండెకు నేస్తాలు. ‘హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్’ అధ్యయనం ప్రకారం, రోజుకు రెండు ఔన్సుల (సుమారు గుప్పెడు) గింజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5 శాతం వరకు తగ్గుతుంది.

సోయాబీన్స్: సోయా, టోఫు, సోయా పాలు వంటివి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు 25 గ్రాముల సోయా ప్రొటీన్‌తో LDLకు 4% వరకు ముగింపు పలకవచ్చంటున్న హార్వర్డ్ పరిశోధకులు.

బెర్రీ పండ్లు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ పండ్లలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరపు ఆహారం తినకుండా అడ్డుకుంటాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రాథమికంగా సాల్మన్, ట్యూనా వంటి సముద్ర చేపల నుండి లభించే బహుళ అసంతృప్త కొవ్వులు. ఇవి మానవ శరీరంలో హానికరమైన తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి

ఓట్స్: ఉదయాన్నే ఒక కప్పు ఓట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే ‘బీటా-గ్లూకాన్’ అనే ప్రత్యేకమైన ఫైబర్, కొలెస్ట్రాల్‌ను గ్రహించి శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్: ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయి. వంటల్లో ఆలివ్ నూనెను వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి.

స్టెరాల్స్, స్టానాల్స్: ఇవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. పండ్లు, కూరగాయలు, గింజలలో ఇవి ఉంటాయి. ‘హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్’ ప్రకారం, రోజుకు 2 గ్రాముల ప్లాంట్ స్టెరాల్స్ తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్ దాదాపు 10% తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad