Heart Beat Vs Heart Attack:ఈ రోజుల్లో చాలా మంది జీవనశైలి బిజీగా, ఒత్తిడితో నిండి ఉంటుంది. పని ప్రెషర్, వ్యక్తిగత బాధ్యతలు, శారీరక శ్రమలేమి కలిపి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతోంది. చాలా మంది శారీరక శ్రమ చేసినప్పుడు మాత్రమే హృదయ స్పందన రేటు పెరుగుతుందని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కూర్చున్నప్పటికీ గుండె వేగం అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది. ఇది సాధారణం కాదని, కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి సంకేతమని వైద్యులు చెబుతున్నారు.
మెట్లు ఎక్కడం, వేగంగా నడక..
సాధారణంగా మెట్లు ఎక్కడం, వేగంగా నడక లేదా పరిగెత్తడం వంటి పనులు చేసినప్పుడు హృదయ స్పందన పెరగడం సహజం. కానీ ఎటువంటి శారీరక కృషి చేయకుండా సీట్లో కూర్చున్నపుడు కూడా హృదయ స్పందన రేటు పెరగడం ఆరోగ్యపరంగా పలు కారణాలను సూచిస్తుంది. చాలా మంది దీన్ని ఒత్తిడి లేదా అలసట ఫలితంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇలా జరగడం వెనుక తీవ్రమైన హృదయ సమస్యలు దాగి ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూర్చున్నప్పుడే గుండె వేగం..
కూర్చున్నప్పుడే గుండె వేగం పెరగడం వెనుక ఒక ప్రధాన కారణం ‘అరిథ్మియా’. ఇది గుండె సవ్యంగా కొట్టుకునే విధానంలో అంతరాయం కలిగించే పరిస్థితి. అరిథ్మియాలో గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఎక్కువగానో, చాలా తక్కువగానో, లేక సక్రమంగా కాకపోవడంగానో ఉంటుంది. ఈ సమస్య గుండె విద్యుత్ వ్యవస్థలో గందరగోళం ఏర్పడటం వల్ల వస్తుంది. ఫలితంగా రక్తాన్ని సరిగా పంపించలేక గుండె పనితీరు దెబ్బతింటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చు.
గుండె వేగం పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆందోళన, భయం, మానసిక ఒత్తిడి వంటి భావోద్వేగ పరిస్థితులు కూడా హృదయ స్పందనను పెంచుతాయి. ఎక్కువగా టీ, కాఫీ, ఆల్కహాల్ తాగడం లేదా ధూమపానం చేయడం గుండె వేగాన్ని అసాధారణంగా పెంచుతుంది. కొంతమంది ఉపయోగించే కొన్ని మందులు కూడా ఈ సమస్యకు కారణమౌతాయి. ముందే ఉన్న గుండె దడ సమస్యలకు దారి తీసే అవకాశాలు కనపడుతున్నాయి.
నీరు తక్కువగా తాగడం..
నీరు తక్కువగా తాగడం వల్ల కూడా గుండె వేగం పెరిగే అవకాశం ఉంది. శరీరంలో నీరు తగ్గిపోతే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. అప్పుడు గుండె రక్తాన్ని సరిపడా పంపించేందుకు ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. ఇది హృదయ స్పందన రేటు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు అసమతుల్యం అవ్వడం వల్ల కూడా గుండె వేగం ప్రభావితం అవుతుంది. ఈ అసమతుల్యత హృదయానికి అదనపు ఒత్తిడి పెడుతుంది.
మధుమేహం…
మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి అప్రమత్తంగా తగ్గిపోతే భయం, బలహీనత, చెమటలు, త్వరిత గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కూర్చున్నప్పటికి గుండె వేగం పెరగడానికి ఒక కారణం. అంతేగాక అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి హృదయ సంబంధిత సమస్యలున్నవారిలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.
గుండె వేగం పెరగడం..
గుండె వేగం పెరగడం శరీరానికి ఇచ్చే ఒక హెచ్చరిక అని గుర్తించాలి. ముఖ్యంగా కూర్చున్నప్పటికీ హృదయ స్పందన రేటు పెరిగితే, అదితో పాటు ఛాతీలో బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, చెమటలు వంటి లక్షణాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలు దేనికి సంకేతాలుగా ఉండవచ్చని వైద్యులు అనుకుంటున్నారు. వెంటనే వైద్య సలహ తీసుకోవాలి.
ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అవసరమైతే ఈసిజి, హోల్టర్ మానిటరింగ్ వంటి పరీక్షల ద్వారా గుండె పనితీరు సరిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. సకాలంలో చికిత్స తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అధిక కెఫిన్, ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించడం, ధూమపానం మానేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని నియంత్రించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి అలవాట్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే నిత్యవ్యాయామం, యోగా, ధ్యానం వంటి పద్ధతులు హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతాయి.


