Sunday, September 8, 2024
Homeహెల్త్skin glowing masks: డల్ స్కిన్ ? ఇలా మెరవండి

skin glowing masks: డల్ స్కిన్ ? ఇలా మెరవండి

కాంతివిహీనంగా ఉండే చర్మాన్ని మెరిపించే ఫేస్ ప్యాక్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి చాకో కెఫైన్ గ్లో ఫేస్ మాస్కు. ఇది పూర్తిగా డ్రై స్కిన్ ను ఉద్దేశించి రూపొందించిన ఫేస్ మాస్కు. ఇందులో ఉన్న చాకొలేట్ లో ఎన్నో సుగుణాలతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఎక్స్ ఫొయిలేట్ చేసే గుణాలున్న కాఫీ కూడా ఈ మాస్కులో ఉంది. దీన్ని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మానికి ఉపశమనాన్ని ఇచ్చే ఎన్నో సుగుణాలు అలొవిరాలో ఉన్న విషయం తెలిసిందే. అలొవిరా ఉన్న ఫేస్ మాస్కు కూడా చర్మాన్ని ఎంతో అందంగా ఉండేలా చేస్తుంది. ఈ మాస్కును చర్మానికి రాసుకోవడం వల్ల యంగ్ గా కనిపిస్తారు. సూర్యరశ్మి నుండి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల బారి నుంచి కూడా చర్మాన్ని అలొవిరా మాస్కు సంరక్షిస్తుంది. చర్మంపై తలెత్తే ఇరిటేషన్లను కూడా ఇది తగ్గిస్తుంది. పైగా ఈ మాస్కు చర్మాన్ని పట్టులా, మ్రుదువుగా ఉంచుతుంది.

- Advertisement -

ఇంకొక ఆరోగ్యకరమైన మాస్కు బయో మడ్ ఫేస్ మాస్కు. బేసిల్, జెరానియం, లవండర్, పిప్పర్ మెంట్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్న ఈ ఫేస్ మాస్కు చర్మానికి కావలసినంత మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. ఈ ఫేస్ మాస్కులో ప్రధానమైన పదార్థం ముల్తానీమట్టి. ఎసెన్షియల్ ఆయిల్స్, ముల్తానీమట్టీల మిశ్రమమైన ఈ మాస్కులో బోలెడు ఖనిజాలు ఉన్నాయి. అంతేకాదు చర్మాన్ని మొదలు కంటా క్లీన్సింగ్ చేస్తుంది ఈ మాస్కు. కాంతివిహీనమైన చర్మాన్ని మెరిపించే మరోక మాస్కు మైసూర్ శాండల్ వుడ్ అండ్ నగ్ కేసర్ ఫేస్ మాస్కు. ఈ మాస్కు సహజమైన పదార్థాలతో తయారు చేసినది. స్వచ్ఛమైన శాండల్ వుడ్, రోజ్ వాటర్, బ్లాక్ హిమాలయన్ మన్ను, ఆయుర్వేదిక్ మూలికల సమ్మిశ్రితం ఈ మాస్కు. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా కాంతివిహీనంగా, అలసినట్టు ఉన్న చర్మానికి గొప్ప వన్నె తెస్తుంది. మరొకటి విటమిన్ సి బ్రైటనింగ్ మాస్కు. ఇది కూడా మార్కెట్ లో దొరకుతుంది.

విటమిన్ సి, విటమిన్ ఇ, హెలొరోనిక్ యాసిడ్ ల సమ్మిశ్రితమైన ఈ మాస్కు చర్మానికి సహజ మెరుపును ఇవ్వడంతో పాటు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ మాస్కులో మ్రుతకణాలను పోగొట్టే, రఫ్ గా ఉన్న చర్మ టెక్స్చెర్ ను తగ్గించే పదార్థాలు కూడా బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫేస్ మాస్కులో అలొవిరా కూడా ఉండడం వల్ల చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ అందుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని మంచి కండిషన్ లో ఉంచుతుంది కూడా. మరి చర్మ వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా ఈ ఫేస్ మాస్కులను మార్కెట్ లో కొని మీ చర్మాన్ని పట్టులా మెరిసేలా చేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News