Drumstick Leaves benefits: మునగకాయ మాత్రమే కాదు. దాని ఆకులు కూడా తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. మునగ కాయతోపాటు మునగ ఆకుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అంతేకాకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మునగ ఆకుల్లో విటమిన్ సి నారింజ పండుతో సమానంగా ఉంటుంది. అలాగే, ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మునగ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, క్లోరోఫిల్, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా కనిపిస్తాయి. అందుకే ఈ ఆకులను పోషకాల నిధిగా పేర్కొంటారు. అనేక పోషకాలతో నిండిన మునగాకులను మన ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కంటి వ్యాధులు, ఆర్థరైటిస్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులను దూరం చేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే మునగ ఆకులు ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే మునగ ఆకులలో డయాబెటిస్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తమ డైట్ లో మునగ ఆకులు చేర్చుకోవడం ఎంతో మంచిది.
Also read: Ginger Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే..
మునగ ఆకులు అధిక రక్తపోటు రోగులకు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది రక్త నాళాలు సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్న రోగులు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటును సులభంగా నియంత్రించవచ్చు.
ఈ ఆకులను డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా నివారించవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, జింక్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.
ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వినియోగం మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సంబంధిత వ్యాధులలో కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.


