Sunday, November 16, 2025
Homeహెల్త్Healthy Fruits: ఈ పండ్ల కలయికతో ఆరోగ్యం మటాష్..

Healthy Fruits: ఈ పండ్ల కలయికతో ఆరోగ్యం మటాష్..

Healthy Fruits Wrong Mix: మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ లో పండ్లను చేర్చుకోవాలి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. అయితే, పండ్లను నేరుగా తినడానికి ఇష్టపడని వారు, వాటిని జ్యూస్ లేదా ఫ్రూట్ సలాడ్ లాగా తయారు చేసుకొని తింటుంటారు.

- Advertisement -

కానీ, మీకు తెలుసా..? రెండు-మూడు పండ్ల రసం లేదా ఫ్రూట్ సలాడ్ తయారు చేసి నేరుగా తింటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని! ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని పండ్ల కాంబినేషన్ అసలు తినకూడదు. ఒకవేళ వీటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

 

Also Read:  Ginger Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే..

పొరపాటున ఈ 5 పండ్లను కలిపి తినకండి

పుల్లని పండ్లతో పాలు

నారింజ లేదా ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులను తినకూడదు. చాలా మంది అనేక సార్లు సార్లు ఈ పండ్ల స్మూతీలు లేదా జ్యూస్‌లను తయారు చేయడానికి పాలు యాడ్ చేస్తారు. కానీ, ఈ కలయిక జీర్ణ సమస్యలతో పాటు కఫ సమస్యలను కలిగిస్తుంది. అయితే దీనికి బదులుగా పాలను తీపి పండ్లతో యాడ్ చేసుకొని స్మూతీలు లేదా జ్యూస్ తయారు చేసుకోవచ్చు.

ఆపిల్-అరటిపండుతో పుచ్చకాయ

ఆపిల్ అరటిపండ్లను పుచ్చకాయతో ఎప్పుడు తినకూడదు. ఎందుకంటే ఈ కలయిక జీర్ణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. పుచ్చకాయ సులభంగా జీర్ణమయ్యే పండు. దీనిని అధిక ఫైబర్ లేదా చక్కెర కలిగిన పండ్లతో కలిపి తింటే, జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

 

Also Read: Drumstick Leaves: మునగాకు ప్రయోజనాలు తెలుసా..?

క్యారెట్, నారింజ

క్యారెట్, నారింజలను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే నారింజలో ఉండే ఆమ్ల లక్షణాలు, క్యారెట్లలో ఉండే అదనపు ఫైబర్, స్టార్చ్ కడుపులో గ్యాస్, గుండెల్లో మంట, పిత్త సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి క్యారెట్, నారింజ కలిపి తినకూడదు.

అరటిపండ్లు, సిట్రస్ పండ్లు

అరటిపండ్లను పైనాపిల్, నారింజ లేదా స్ట్రాబెర్రీ వంటి అధిక ఆమ్ల పండ్లతో తింటే ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.

 

ఆప్రికాట్లు, దానిమ్మలు
ఆప్రికాట్లు, దానిమ్మలను కలిపి ఎప్ప్పుడు తినకూడదు. ఎందుకంటే ఈ రెండు పండ్లలో అధిక ప్రోటీన్, చక్కెర కంటెంట్ ఉంటుంది. వీటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, ఆమ్లతకు కారణమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad