Saturday, November 23, 2024
Homeహెల్త్Wrinkles and Remedies: ముఖంపై ముడతలు పోగొట్టే చిట్కాలు

Wrinkles and Remedies: ముఖంపై ముడతలు పోగొట్టే చిట్కాలు

ఏజింగ్, స్కిన్ హెల్త్ చెప్పే ముడతలు

కొబ్బరినూనెతో ముఖంపై పడ్డ ముడతలు పోతాయి. ఇందుకు కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే..

- Advertisement -

కొబ్బరినూనెతో ముడతలు పోవాలాంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. మొదట ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొన్ని చుక్కల కొబ్బరినూనె తీసుకుని దాన్ని ముఖంపై, మెడ భాగంలో రాసి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత వెంటనే ముఖం కడుక్కోకుండా ఆ రాత్రంతా అలాగే ఉంచుకుని మర్నాడు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజు రాత్రి నిద్రపోయేముందు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.


యాపిల్ సిడార్ వెనిగర్, కొబ్బరినూనె కాంబినేషన్ తో కూడా ముఖంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి. దీనికి ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు, కొన్ని చుక్కల వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. వీటితో పాటు ఒక కాటన్ బాల్ కూడా రెడీ పెట్టుకోవాలి. తర్వాత యాపిల్ సిడార్ వెనిగర్ లో కాస్త నీళ్లు పోసి పలచగా చేసి అందులో కాటన్ బాల్ ముంచి ముఖంపై అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత కొబ్బరినూనెతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ముఖానికి రాసుకున్న నూనెను రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా ప్రతి రోజు రాత్రి చేయడం వల్ల చర్మం సున్నితంగా, పట్టులా తయారవుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ లోని ఎసిడిటీ స్కిన్ పిహెచ్ ప్రమాణాలను, స్కిన్ టోన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత కొబ్బరినూనెను ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఏర్పడ్డ ముడతలు శుభ్రంగా పోతాయి.


ఆముదంనూనె, కొబ్బరినూనె కాంబినేషన్ చర్మాన్ని మ్రదువుగా చేస్తుంది. ముడతలు పోగొడుతుంది. రెండు లేదా మూడు చుక్కల ఆర్గానిక్ కొబ్బరినూనె, రెండు లేదా మూడు చుక్కలు ఆముదం తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా రాయాలి. నిద్రపోయేముందు దీన్ని రాసుకుంటే తెల్లరేవరకూ అలాగే ఉంచుకోవచ్చు. ఇలా రోజూ చేస్తే చర్మంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి. ఆముదం నూనె చర్మానికి డీప్ కండిషనర్ గా పనిచేస్తుంది. అందులో యాంటాక్సిడెంట్లు, యాంటిఇన్ప్లమేటరీ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అది చర్మాన్ని పట్టులా, యవ్వనంతో మెరిసిపోయేలా చేస్తాయి. అంతేకాదు చర్మంపై ఏర్పడ్డ ఫైన్ లైన్స్, ముడతలను శుభ్రంగా పోగొడతాయి.


విటమిన్ ఇ, కొబ్బరినూనె మిశ్రమం కూడా చర్మంపై ముడతలను పోగొడతాయి. దీనికి ఒక విటమిన్ ఇ కాప్సూల్, కొన్ని చుక్కల ఆర్గానిక్ కొబ్బరినూనె రెడీ పెట్టుకోవాలి. విటమిన్ ఇ కాప్సూల్ ని కట్ చేసి అందులో ఉన్న పదార్థాన్ని చిన్న గిన్నెలో పోయాలి. దీనికి కొబ్బరినూనె కలిపి మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న ముఖంపై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా నిత్యం రాత్రిపూట చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. కొబ్బరినూనె, తేనె కలిపి చర్మంపై రాసుకుంటే స్కిన్ ఆరోగ్యంగా ఉండడమే కాదు, అందంతో మెరిసిపోతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ కొబ్బరినూనె, అర టీస్పూను ముడి తేనె తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ పేస్టను దెబ్బతిన్న చర్మంపై పెట్టుకొని ఒక గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. నిత్యం ఒకసారి ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. యంగ్ గా కనిపిస్తారు. మీ వయసు కూడా తెలియదు.

కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి చర్మానికి పట్టిస్తే ముడతలు పోతాయి. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూను పచ్చిపాలను రెడీగా పెట్టుకోవాలి. పాలల్లో నిమ్మరసం వేసి అవి పేరుకునే వరకూ మెల్లగా కలపాలి. ఈ మిశ్రమంలో కొబ్బరినూనె వేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయలి. ఆ తర్వాత కూడా 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా నిత్యం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మరసంలో చర్మాన్ని శుభ్రం చేసే గుణాలున్నాయి. అంతేకాదు చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చర్మం ఎలాస్టిసిటీని బాగా మెరుగుపరుస్తుంది. దీంతో చర్మంపై ఏర్పడ్డ ముడతలు తగ్గుతాయి. పాల ఉత్పత్తులతో ఎలర్జీ ఉన్న వారు దీన్ని ప్రయత్నించకుండా ఉంటే మంచిది.


పసుపు, కొబ్బరినూనె కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు స్కిన్ పై ఉన్న ముడతలను పోగొడుతుంది. దీనికి ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, చిటికెడు పసుపు రెడీ పెట్టుకోవాలి. ఆ ఆయిల్ లో పసుపు వేసి మెత్తగా అయ్యేంతవరకూ బాగా కలపాలి. ఆ పేస్టును ముడతల మీద రాసి, 15 నుంచి 20 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పసుపులోని యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కాకుండా పరిరక్షిస్తుంది. అంతేకాదు చర్మాన్ని మరింత ఆరోగ్యవంతం చేస్తుంది. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్సు కూడా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News