Tuesday, September 17, 2024
Homeఇంటర్నేషనల్Japan hit with earth quake: జ‌పాన్‌ను కుదిపేసిన భూకంపం

Japan hit with earth quake: జ‌పాన్‌ను కుదిపేసిన భూకంపం

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు

జపాన్‌ ఇషికావాలోని ఉత్తర-మధ్య ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపాలు కుదిపేశాయి. నోటో ద్వీపకల్పం ఉత్తర భాగంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సునామీ ప్రమాదం ఏమీ లేదని జపాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లలో ఎలాంటి అసాధారణ పరిస్థితి కనిపించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. నోటో ద్వీపకల్పంలోని షికా ప్లాంట్‌కు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. రెండు రియాక్టర్‌ల శీతలీకరణపై అది ప్రభావితం చూపలేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా తనిఖీల కోసం షింకన్‌సెన్ సూపర్-ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇతర రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News