భారతదేశంలో టాప్ 10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల(Richest MLAs) జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా రూ.3,383 కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో రూ.1,413 కోట్లతో ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) నిలిచారు. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రూ.1,267 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. కుప్పం ఎమ్మెల్యే, ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) రూ.931కోట్లతో 5వ స్థానంలో నిలవగా.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి నారాయణ రూ.824కోట్లతో 6వ స్థానంలో ఉండగా.. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి(Jagan) రూ.757కోట్లతో ఏడో స్థానంలో.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716కోట్లతో ఎనిమిదో స్థానం దక్కించుకున్నారు.
టాప్-10 ధనిక ఎమ్మెల్యేల జాబితా-2025 ఇదే..
- పరాగ్ షా (బీజేపీ, మహారాష్ట్ర) – రూ. 3,383 కోట్లు
- డీకే శివకుమార్ (కాంగ్రెస్, కర్ణాటక) – రూ. 1,413 కోట్లు
- కేహెచ్ పుట్టస్వామి గౌడ (స్వతంత్ర ఎమ్మెల్యే, కర్ణాటక) – రూ.1,267 కోట్లు
- ప్రియకృష్ణ (కాంగ్రెస్, కర్ణాటక) – రూ.1,156 కోట్లు
- నారా చంద్రబాబునాయుడు (టీడీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 931 కోట్లు
- పొంగూరు నారాయణ (టీడీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 824 కోట్లు
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైసీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 757 కోట్లు
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (టీడీపీ, ఆంధ్రప్రదేశ్) – రూ. 716 కోట్లు
- జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ (బీజేపీ, గుజరాత్) – రూ. 661 కోట్లు
- సురేషా బీఎస్ (కాంగ్రెస్, కర్ణాటక) – రూ. 648 కోట్లు