హోండా మరోసారి తన ఐకానిక్ స్కూటర్ శ్రేణిని హోండా యాక్టివా 8G 2025తో అప్‌గ్రేడ్ చేసింది. బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్, స్మార్ట్ ఫీచర్లు, పాకెట్-ఫ్రెండ్లీ ఫైనాన్సింగ్‌తో వస్తుంది.
హోండా యాక్టివా 8G 2025, లీటరుకు 85 కి.మీ మైలేజ్ ఇవ్వడం సిటీ కమ్యూటర్లకు కలిసొచ్చే అంశం. సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్, స్టైలిష్ LED లైట్లతో దాని విశ్వసనీయతను కొనసాగిస్తోంది.
సమర్థవంతమైన 110cc ఇంజిన్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్‌కు అనుకూలంగా పనిచేస్తుంది. కుషన్డ్ సీట్లు, మృదువైన సస్పెన్షన్ సిస్టమ్‌తో ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై సైతం సాఫ్ట్ రైడ్‌ను ఇస్తుంది. ఫుట్‌రెస్ట్‌లు, హ్యాండిల్‌బార్ పొజిషనింగ్ ప్లస్ పాయింట్స్.
2025 యాక్టివా 8G స్మార్ట్ LED హెడ్లైట్లు, టెయిల్ లైట్లు రాత్రి ప్రయాణాల్లో మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్.. స్పీడ్, ఇంధన స్థాయి, సర్వీస్ వార్నింగ్ వంటి ముఖ్యమైన రైడ్ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
యాక్టివా 8G 2025 ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు, మన్నికైన టైర్లతో పాటుదృఢమైన ఛాసిస్‌ను కలిగి ఉంది. హోండా యాక్టివా 8G 2025ను సొంతం చేసుకోవాలనుకుంటే.. రూ. 15,000 డౌన్ పేమెంట్ చేయాలి.
నెలకు రూ. 2,199 EMIతో ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తుంది. ఇండియాలోని అధీకృత హోండా డీలర్‌షిప్‌లలో ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లు, సర్వీస్ ప్యాకేజీలతో అందుబాటులో ఉంది.