Monday, May 13, 2024
HomeతెలంగాణMallapur: కవితకు పట్టిన గతే అరవింద్ కు..

Mallapur: కవితకు పట్టిన గతే అరవింద్ కు..

జువ్వాడి. నర్సింగా రావు

మల్లాపూర్ మండల కేంద్రంలోని నడిమివాడ రెడ్డీస్ పంక్షన్ హల్ లో మండల బూత్ స్థాయి కార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలాల. జలపతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి. నర్సింగా రావు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జలపతి రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి మండలం నుంచి భారీ మెజార్టీ సాధించాలని కోరారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగా రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని మెజారిటీతో గెలిపించాలని, ప్రతి కార్యకర్త తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వంది అని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, మే 1 న సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ కమిటీల్లో వారికి స్థానం ఉంటుందని భరోసా. పాత కొత్త కలయికతో అందరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. కష్టపడ్డ వారిని గుండెల్లో పెట్టుకుంటాం ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉంటామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండే బాధ్యత నాపై ఉందన్నారు.

వచ్చే ఐదు సంవత్సరాలు కార్యకర్తల కోసం కష్టపడుతానని, రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు అండగా నిలిచే బాధ్యత నాపై ఉందన్నారు. ప్రేమ,అభిమానంతో వివిధ పార్టీల నుండి కార్యకర్తలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారన్నారు. అరవింద్ అబద్దాల కోరని, టికెట్ అందరికీ ఇస్తానని మోసం చేసారని ఆరోపించారు. గతంలో కవితకు పట్టిన గతే అరవింద్ కు పడుతుందని హెచ్చరించారు. అరవింద్ అహంకారం పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, జీవన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కష్టపడాలన్నారు. రైతు నాయకుడైన జీవన్ రెడ్డి కోసం అందరం కష్టపడి బంపర్ మెజారిటీ ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి. కృష్ణా రావు, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జె యన్. వెంకట్, ఆకుల లింగా రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మండల నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, బాపు రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఆనంద్, నవీన్, పోతు శేఖర్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News