IND vs WI 2nd Test Playing XI: భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు ఢిల్లీ వేదికగా అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ లో టీమిండియా ఏ జట్టుతో బరిలోకి దిగుతుందనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులోనూ సులభంగా గెలవాలని చూస్తోంది.
టీమ్ ఇండియా 2023లో చివరిసారిగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. అప్పుడు భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లుతో బరిలోకి దిగింది. అయితే రేపు జరగబోయే మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా మార్పులు లేకపోవచ్చు, గానీ బౌలర్లును మార్చే అవకాశం ఉంది. స్టార్ పేసర్ బుమ్రాకు ఢిల్లీ టెస్టులో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. పని భారం అధికం కావడమే అతడి రెస్ట్ కు కారణం. అదే గానీ జరిగితే అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ దళాన్ని సిరాజ్ లీడ్ చేసే అవకాశం ఉంది. ఒక వేళ అతడికి కూడా విశ్రాంతినిస్తే ముఖేష్ కుమార్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియాతో వన్డే జట్టులో సిరాజ్ కూడా ఉన్నాడు. దీంతో విండీస్ తో రెండో టెస్టులో అతడికి రెస్ట్ ఇవ్వొచ్చు.
మరోవైపు స్పిన్ దళాన్ని కులదీప్ యాదవ్ లీడ్ చేయనున్నాడు. ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆసియా కప్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న అతను విండీస్ తో జరిగిన తొలి టెస్టులోనూ సత్తా చాటాడు. మరోసారి చెలరేగడానికి సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ మరియు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నాడు. పార్ టైమ్ బౌలర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఉండనే ఉన్నారు. గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ అదే ఫామ్ ను కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఫామ్ లోకి రావాల్సి ఉంది.
Also Read: Gautam Gambhir – రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు గంభీర్ స్పెషల్ పార్టీ.. ఎందుకో తెలుసా?
టీమిండియా ఫ్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్


