Infosys: నారాయణమూర్తి అంటే గుర్తొచ్చే పేరు ఇన్ఫోసిస్. భారత ఐటీ సేవల్లో రెండో అతి పెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్.. ఏఐ విప్లవంలో వెనుకబడిందని మీనల్ గోయల్ అనే సీఏ అన్నారు. ఇందుకు ప్రధాన కారణం నారాయణమూర్తి పాతకాలపు ఆలోచనలే అని మీనల్ అభిప్రాయం వ్యక్తం చేయడం టెక్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
2015లో ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న విశాల్ సిక్కా.. ఆ కంపెనీని ఏఐ ఫస్ట్ కంపెనీగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సామర్థ్యాలను సంపాదించేందుకు ఓపెన్‌ఏఐ సంస్థలో బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 8,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టాలని భావించారు. సిలికాన్ వ్యాలీలోని అమెజాన్, టెస్లా వంటి కంపెనీలతో కలిసి ఈ పెట్టుబడి చేయాల్సి ఉండగా.. సిక్కా ఆలోచనలకు నారాయణమూర్తి ఆలోచనలతో బ్రేక్ వేశారట.
భవిష్యత్తు టెక్నాలజీలపై పెట్టుబడి పెట్డడం రిస్క్ అని నారాయణమూర్తి వాదించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఓపెన్ ఏఐలో బిలియన్ డాలర్ పెట్టుబడిని ఇన్ఫోసిస్ వెనక్కి తీసుకుంది. అనంతరం విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసి కంపెనీ నుంచి బయటకు వచ్చారట. ఆ తర్వాత ఆయన ఓపెన్‌ఏఐలో అడ్వైజర్‌గా పనిచేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/kuttu-atta-food-poison-in-delhi-200-members-hospitalized/
ఒకవేళ ఆ రోజు ఇన్ఫోసిస్.. ఓపెన్‌ఏఐలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని మార్కెట్ విలువ 45 బిలియన్ డాలర్లకు చేరుకుని ఉండేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం కిందటే నారాయణమూర్తి ముందు చూపుతో ఆలోచించి ఉంటే.. ఇప్పుడు గ్లోబల్ ఏఐ రేసులో భారత కంపెనీ ఇన్ఫోసిస్ తిరుగులేని ఆధిపత్యాన్ని పొంది ఉండేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.


