Thursday, September 26, 2024
HomeతెలంగాణGarla: కోతి పిల్ల మృతి..తల్లి వానరం వ్యథ వర్ణనాతీతం..కన్నీళ్లతో కదిలిన దండు

Garla: కోతి పిల్ల మృతి..తల్లి వానరం వ్యథ వర్ణనాతీతం..కన్నీళ్లతో కదిలిన దండు

గుండె బరువెక్కే..

నవ మాసాలు మోసి పేగు తెంచుకొని మరీ జన్మనిచ్చిన బిడ్డపై అమ్మకు ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పడం కొంచెం కష్టమే తన ప్రాణాన్నే పణంగా పెట్టి జీవం పోసిన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అలాంటి బిడ్డ దూరమైతే ఆ మాతృ వేదన మనుషుల్లోనే కాదు మూగజీవుల్లోనూ ఉంటుంది.

- Advertisement -

తల్లి వానరం పడుతున్న బాధను అర్థం చేసుకొని అండగా నిలిచిన ఆ దండు చూపిన తెగువ నిజంగా మానవులకు ఓ మేలుకొలుపే. గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామ శివారులో పంట చేల నుంచి కొన్ని వానరాలు రోడ్డు దాటి వెళుతుండగా.. అందులో ఓ తల్లి కోతి, పిల్ల కోతి కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలు వేగంగా వస్తుండగా మిగతా కోతుల్లాగానే తల్లి కోతి వేగంగా దాటేసింది. అయితే ఈ క్రమంలో పిల్ల కోతిని ప్రమాదవశాత్తు అటుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కోతి పిల్ల అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

దీంతో నడిరోడ్డుపై పడి ఉన్న కోతి పిల్లను చూసి ఆ తల్లి వానరం గుండె తరుక్కుపోయింది. తన బిడ్డ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక రోడ్డు మీదికి పక్కనున్న చెట్లలోకి అదే పనిగా తిరుగుతూ తన బిడ్డ మృత దేహం చుట్టూ తచ్చాడుతూ, తన మాతృ వేదనను వెళ్లగక్కింది. అప్పటికే ముందుకు సాగిన కోతులు ఈ దృశ్యాన్ని చూసి వెనక్కి తిరిగాయి.

దండు మొత్తం కదిలి ఘటనా స్థలికి చేరుకొని రోడ్డుపైకి చేరాయి. అటుగా వెళ్తున్న వాహనదారులకు వానర గుంపు చుక్కలు చూపించాయి. తన కళ్ల ముందే బిడ్డ చనిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లి వానరం పడిన బాధ, ఆ తల్లి కోతిని చూసి తనకు అండగా నిలిచిన దండును చూసి అక్కడున్న జనాలు నివ్వెరపోయారు. మనుషుల్లో కూడా చూడని ఇంతటి ఎమోషన్‌ వానరాల్లో చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News