జడ్చర్ల పట్టణం మీదుగా 167వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఎల్ఐసి ఆఫీస్ ఎదురు నుండి డిగ్రీ కాలేజ్ వరకు నిర్మాణం చేపడుతున్న రహదారి నిర్మాణం, సిగ్నల్ గడ్డ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం 30 రోజుల్లో పూర్తి చేయకుంటే నవంబర్ 14 న అక్కడే నడి రోడ్డుపై నిరసన దీక్ష చేపడతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 1వ వార్డు కౌన్సిలర్ ఫహి మినాజ్, బిఆర్ఎస్ నాయకులు షేక్ బాబా తన అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం జడ్చర్ల ప్రేమ్ రంగా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ ఫహి మినాజ్, షేక్ బాబా లకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని తీసుకొనినని చెప్పడం జరిగిందని, కానీ ఇతర పార్టీలలో ఉండి అక్రమాలకు పాల్పడకుండా ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త నీతి నిజాయితీకి మారుపేరని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని, పార్టీ అధికారం లేనప్పుడు కష్టపడి పని చేసిన వారందరికీ నా మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. పట్టణంలో సిగ్నల్ గడ్డ రోడ్డు జాతీయ రహదారుల పరిధిలో ఉందని, దానిని త్వరగా పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను కోరడం జరిగిందని, 30 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయకుంటే మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ నవంబర్ 14 నా దీక్ష చేస్తానని తెలపడం జరిగిందని, రోడ్డు పనులు 30 రోజుల్లో పూర్తి కాకుంటే నేను కూడా శివకుమార్ తో కలిసి రోడ్డుపై నిరసన దీక్ష చేపడతానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, వెంకటేశం, అశోక్ యాదవ్, మీనాజుద్దీన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.