Thursday, February 13, 2025
HomeతెలంగాణNirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు

Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందనే విపక్షాల విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలమ్మ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని తెలిపారు. అయితే ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదన్నారు.

- Advertisement -

కాగా అంతకుముందు లోక్‌సభలో ఆదాయపు పన్ను కొత్త బిల్లును నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్ మెంట్ ఇయర్ ఉండగా ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News