Friday, November 22, 2024
HomeతెలంగాణRohit Reddy: రైతులు అంటేనే కాంగ్రెస్ కు ఇష్టం లేదు

Rohit Reddy: రైతులు అంటేనే కాంగ్రెస్ కు ఇష్టం లేదు

కేంద్రం చేతుల్లోకి మన ప్రాజెక్టులు వెళితే సాగునీరు దొరకడం కష్టం

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ….  క్రిష్ణా బోర్డుకు మన ప్రాజెక్టులను అప్పగించడం చాలా పెద్ద ఘోరం. కేంద్రం ఓత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గడంపై అనుమానాలు ఉన్నాయి. కేంద్రంలోని బిజేపి రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్రం చేతుల్లోకి మన ప్రాజెక్టులు వెళితే సాగునీరు దొరకడం కష్టం అవుతుంది అని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి కొరకు పదేళ్ల పాటు చాలా కష్టపడ్డారు. పాలమూరు.. రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను చేపట్టి 80 శాతం పూర్తి చేశారు. ఈ ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. క్రిష్ణా బోర్డు చేతుల్లోకి శ్రీశైలం ప్రాజెక్టు వెళ్లడంతో పాలమూరు ఎత్తిపోతలు వట్టిపోవడం ఖాయం.  జిల్లాకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు..రంగారెడ్డి పథకంను అడ్డుకునేందుకు కుట్ర చేస్తోంది అని అన్నారు. కాలువల నిర్మాణంకు కేసీఆర్ రూ.5,600 కోట్లతో టెండర్లు కూడా పూర్తి చేశారు. ఈ టెండర్లను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది… మరోవైపు నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకంను కాంగ్రెస్ తెరమీదకు తెచ్చింది.
పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి కొడంగల్ ఎత్తిపోతలను తెరమీదకు తీసుకవచ్చారు.
కొడంగల్ ఎత్తిపోతల పేరుతో పాలమూరు ఎత్తిపోతల పథకంను పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే జిల్లాకు ఉదండాపూర్ జలాశయం నుంచి సాగునీరు రావడం కష్టమన్నారు. జిల్లాకు సాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. తాండూరుకు సాగునీరు ఇచ్చేందుకు టేల్ ఎండ్(చివరిలో)లో ఉండడంతో తట్టేపల్లి వద్ద ఒక టిఎంసీతో జలాశయం కొరకు ప్రయత్నించాను. ఈ జలాశయం నిర్మాణంకు సర్వే కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లడంతో కొడంగల్ ఎత్తిపోతల పథకంతో తాండూరుకు కూడా సాగునీరు రావడం కష్టంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం తర్వాత చేస్తుందన్నారు. రైతులు అంటేనే కాంగ్రెస్ కు ఇష్టం లేదు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.. డిసెంబర్ 9 పోయి రెండు నెలలు గడుస్తోంది. ఇప్పటికి రూ.2 లక్షల రుణమాఫీ పేరుతో రైతులను పచ్చిగా మోసం చేశారు. రైతుబంధు నేటికీ ఇవ్వలేదు. డిసెంబర్ లో రావాల్సిన రైతుబంధు ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతుబంధు డబ్బు అడిగితే చెప్పుతో కడతామని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో రైతులు కాంగ్రెస్ పార్టీని ఓటుతో కొట్టాలని నా విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, అంతరాయం లేకుండా 5 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదు. బిఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంను కాపాడేందుకు సిద్ధమైందని చెప్పుకొచ్చారు. గతంలో ప్రత్యేక రాష్ర్ట సాధన ఉద్యమం మాదిరిగా ప్రాజెక్టులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News