Wednesday, March 26, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: ఏపీలో నీటి ఎద్దడి.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు..!

AP: ఏపీలో నీటి ఎద్దడి.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేడిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. నీటి సరఫరా తక్కువగా ఉండటంతో, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటిని ప్రజలకు అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి నిల్వలు, సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అలాగే, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా తాత్కాలిక నీటి వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

- Advertisement -

ఇందులో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మోటార్లు, పంపుల మరమ్మతులతో పాటు అధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాల్లో అదనపు నీటి వనరులను సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వ్యవసాయ నీటి అవసరాలపైనా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. పంటలు చివరి దశలో ఉన్నందున, రైతులకు నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని, నీటి లీకేజీలు, అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి నీటి సమస్యలపై సమీక్ష అనంతరం, ఈ నెల 27న సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News