అలుపెరుగని కృషితో నిత్యం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి గ్రామములోని ప్రతి గడప పట్టణంలోని ప్రతి గడప కలయ తిరుగుతూ వారి సమస్యలు విని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను వివరిస్తూ లబ్ధి పొందని వారిని గుర్తించి వారికి మేలు చేసే విధంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ముందుకు తీసుకుపోతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని 4వ సచివాలయం పరిధిలోని 4వ వార్డు పుల్లారెడ్డి వీధి,సీతారాం నగర్,కలసపాడు వీధుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు సీఐ రమేష్ బాబు ఎస్ఐ నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ నాయుడు రసూల్ కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, డాక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి, శింగం వెంకటేశ్వర్ రెడ్డి, నంద్యాల వైకాపా నాయకుడు అమీర్ భాష దాల్ మిల్ గఫూర్, అన్ని శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. నాలుగో వార్డులోనిపుల్లారెడ్డి వీధి చేరుకున్న ఆయనకు ప్రజలు పూలమాలలు వేసి ఘన స్వాగత పలికారు. ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పథకాలు వివరిస్తూ ఇంకా అర్హులై ఉండి పథకాలందని వారు ఉంటే తెలపాలని ఆయన కోరారు. అలాగే వీధి ప్రజలు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తేగా వెనువెంటనే సంబంధిత అధికారులకుతెలిపి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తేవాలని నిత్యం మీకు అందుబాటులో ఉన్నానన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం లంచాలకు ఎలాంటి తాగు లేకుండా వాలంటరీ సచివాలయ వ్యవస్థ స్థాపించి పేదలకు దగ్గరగా పనిచేస్తుందని మేరె ఫస్టులో ఇచ్చిన హామీలను 95% అమలు చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని ప్రజల కులం మతం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు, గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అంటే కేవలం ఆ పార్టీ కార్యకర్తలకు,ఆపార్టీకి నచ్చిన వారికే అందేవనికానీ ఇపుడు జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దళారుల కమిటీలు లేకుండా అర్హత ఉంటే చాలు నేరుగా లబ్దిదారుల అకౌంట్లోనే నగదు జమ చేస్తూ ప్రజలకు పారదర్శక పాలనను అందిస్తున్న మన వైఎస్సార్సీపీ మన జగనన్న ప్రభుత్వాని మీ చల్లనిమనసుతో దీవించి అందరు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గంగులకోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రమణారెడ్డి ,మున్సిపల్ ఏఈ సురేంద్రరెడ్డి, విద్యుత్ ఏఈ కంబగిరి ,కౌన్సిలర్లు, నరసింహులు బాలబ్బి గురుమూర్తి, వైకాపా నాయకులు కాంట్రాక్టర్ అజాద్, నజీర్, జీడి రామిరెడ్డి ,కొండపల్లి శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మెప్మా సుబ్బయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి విఆర్ఓ పరమేశ్వర్ రెడ్డి, గుర్రప్ప, నరసయ్య, లక్ష్మిరెడ్డి, పంచ నాగరాజు, రామ్మోహన్ రెడ్డి, చక్రవర్తి, సచివాలయ సిబ్బంది వాలంటర్లు పాల్గొన్నారు.