Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula: జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే

Gangula: జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే

గోన నాగిరెడ్డి సతీమణి గోన వెంకటేశ్వరమ్మకు సన్మానం

ఆళ్లగడ్డ పట్టణంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం స్వతంత్ర స్వాతంత్ర జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం స్వీకరించారు, అనంతరం స్వాతంత్ర సమరయోధుల స్తూపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులు గోన నాగిరెడ్డి సతీమణి గోన వెంకటేశ్వరమ్మను శాలువతో సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఎమ్మెల్యే గంగుల వివరించారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు మున్సిపల్ వైస్ చైర్మన్ నాయుబ్ రసూల్, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News