Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: బాలింత, గర్భిణీ మహిళలకు రేషన్ పంపిణీ

Gangula: బాలింత, గర్భిణీ మహిళలకు రేషన్ పంపిణీ

జగన్ కు ప్రతి తల్లి. చిన్నారులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

వైఎస్సార్ సంపూర్ణ పోషణ అనేది సంక్షేమ కార్యక్రమంలో ఒక భాగంగా మహిళల అభివృద్ధి శిశు సంక్షేమ ధ్యేయంగా పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలకు వారి పోషణ ఆహార అవసరాలను తీర్చడానికి పౌష్టికాహారం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి అన్నారు. పట్టణంలోని సద్దాం కాలనీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు , ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి , కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, కాంట్రాక్టర్ అజాద్, 8వ వార్డు కౌన్సిలర్ షేక్ మోబిన్ పాల్గొని బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లను పంపిణీచేశారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బలహీన వర్గాల్లో పోషకహార లోపాన్ని నివారణకై ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ చేపట్టడం జరిగింది అన్నారు. నియోజవర్గంలో పిల్లలు పాలిచ్చే తల్లులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గర్భిణీ, పాలిచ్చే తల్లులలో పోషకాహారం లోపము, రక్తహీనతపై దృష్టి పెడుతూ అన్ని అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం అందిస్తామన్నారు బాలింతలు వారి ఇంటి దగ్గరికి వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను చేరవేస్తామన్నారు నాయకుడు మన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి తల్లి చిన్నారులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే గంగుల ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News