Saturday, April 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan tweet on Veligonda negligance: వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ ట్వీట్

Jagan tweet on Veligonda negligance: వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ ట్వీట్

కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై @ncbn ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్‌ను వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. కోవిడ్‌ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్‌–1, జనవరి 2024లో టన్నెల్‌–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైయస్సార్‌గారి కలలను సాకారం చేశాం. ఇంకా ఆర్‌ అండ్‌ ఆర్‌ (రీహ్యాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌) పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లోనే దానికి కావాల్సిన సుమారు రూ.1200 కోట్లు చెల్లిస్తే, ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆర్‌ అండ్‌ ఆర్‌పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News