కర్నూలు నగరంలోని స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 77వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి-శిక్షణ శాఖా మాత్యులు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
బుగ్గన రాజేంద్ర నాథ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తో కలిసి కవాతు వాహనం నుండి సాయుధ దళ పరిశీలన చేశారు. ఏ ఆర్, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఫైర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ సందేశాన్ని చదివి వినిపించారు.
కర్నూలు నగరంలోని వివిధ పాఠశాలల, కళాశాలల చిన్నారులు, బాల బాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులను, మెమెంటోలను ప్రదానం చేశారు. జిల్లా మంత్రి బుగ్గన అనంతరం జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి మెరుగైన సేవలదించిన జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను మంత్రి బుగ్గన అందచేశారు.
కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సన్మానించారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, జేసి నారపురెడ్డి మౌర్య, సెబ్ అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ బుట్టా రేణుక స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలు, విద్యార్థులు,ప్రజలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సన్మానం పొందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యుల్లో గుర్రం జైపాల్ రెడ్డి s/o గుర్రం వెంకట్ రెడ్డి, కెవిఆర్ గార్డెన్, కర్నూలు, జి.సుబ్బమ్మ W/o జి.సత్య నారాయణ, కలే కరీం మస్జీద్ దగ్గర, కర్నూలు, శ్రీమతి ఎం.సి.ఎంకమ్మ, w/o ఎం.సి.శుభకర్, చిన్నా మార్కెట్, కర్నూలు, ఎస్.డి.నాగేంద్ర ప్రసాద్, s/o ఎస్.డి.నారాయణ రావు, కర్నూలు టౌన్, ఎల్.సరోజమ్మ, w/o ఎల్.సంజీవ రెడ్డి, కర్నూలు, డి.రాధాకృష్ణ మూర్తి, s/o డి.చెన్నయ్య, బాలాజీ నగర్, కర్నూలు, ఎస్.ఐ.భాష బియబాని, s/o ఎస్ఎంకే.బియాని, జర్నలిస్ట్ కాలనీ, కర్నూలు. సైదా జైన బిబీ, d/o ఎస్ఎంకే.బియాని, జర్నలిస్ట్ కాలనీ, కర్నూలు. ఎస్.బి.విష్ణువర్ధన్, s/o. బి.హనుమప్ప నాయక్, కర్నూలు, కథం తుక్క చంద్రకుమార్, s/o.తుక్కోజి రావు, బండిమెట్ల, కర్నూలు. వీరిని ఆర్థిక శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ దుశాలువ మరియు పూలమాలతో సన్మానించారు.