Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: హ్యాండ్‌బాల్‌ ‌పోటీల్లో నంద్యాలకు వెండి పతకాలు

Nandyala: హ్యాండ్‌బాల్‌ ‌పోటీల్లో నంద్యాలకు వెండి పతకాలు

ఆంధ్రప్రదేశ్ అంతర్-జిల్లా సబ్-జూనియర్, జూనియర్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నంద్యాల జిల్లా జట్లు వెండి పథకాలు సాధించాయి. 37వ సబ్-జూనియర్, 44వ జూనియర్ అంతర జిల్లాల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో నంద్యాల జిల్లా రన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 13, 14 తేదీల్లో క్రిష్ణా జిల్లా గన్నవరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగాయి. జూనియర్ విభాగం బాలుర ఫైనల్ మ్యాచ్‌లో విశాఖపట్నం నంద్యాల జిల్లాపై విజయం సాధించగా, సబ్ జూనియర్ విభాగంలో విశాఖపట్నం నంద్యాలపై విజయం సాధించింది. రెండు ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠ మధ్య జరిగాయి.

- Advertisement -

మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నంద్యాల జిల్లా సబ్ జూనియర్, జూనియర్ జట్ల క్రీడాకారులను నంద్యాల జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ప్రతినిధులు మహబూబ్ బాషా, రామేశ్వర్ రెడ్డి, రాజకుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News