ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో డయాబెటిస్ వ్యాధి గుర్తింపు, నివారణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థకు అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లయన్స్ డయాబెటిస్ ఫౌండేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నంద్యాలలో ఒప్పందం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లయన్స్ సేవా సంస్థ రాష్ట్ర నాయకుల రెండు రోజుల సదస్సు నంద్యాలలో జరుగుతున్న సందర్భంగా అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ ఫౌండేషన్ ప్రతినిధి, మాజీ లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయకుమార్ రాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ఈమేరకు పరస్పర ఒప్పందం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన డయాబెటిస్ అవగాహన నడక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయాబెటిస్ నివారణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమైన పరికరాలను సమకూర్చుతామన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతాయన్నారు.
Nandyala: డయాబెటిస్ నివారణకు లయన్స్ ఒప్పందం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES