Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: తల్లుల ఖాతాల్లో 217.20 కోట్ల జమ

Nandyala: తల్లుల ఖాతాల్లో 217.20 కోట్ల జమ

నంద్యాల జిల్లాలో అర్హత కల తల్లులకు 15,000/-

పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న సమున్నత ఆశయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకం కింద జిల్లాలోని అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 1,67,084 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.217.20 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటినరీ హాల్ లో రాష్ట్రవ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరానికి నాల్గవ విడతగా ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న 83,15,341మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్ల రూపాయలను పార్వతీపురం, మన్యం జిల్లా, కురుపాంలో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మార్క్ఫెడ్ చైర్మన్ పి.పి నాగిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హాబీబుల్లా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీతా అమృత్ రాజ్, డీఈఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో జగనన్న అమ్మ ఒడి పధకం కింద అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15,000/-లు చొప్పున 1,67,084 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.217.20 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. పిల్లల చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. అలాగే నాడు నేడు కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుస్తునట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 27,773 మంది విద్యార్థుల తల్లులకు రు.36.10 కోట్లు, బనగానపల్లిలో 27,128 మందికి రు.35.26 కోట్లు, డోన్ లో 28,575 మందికి రు.37.14 కోట్లు, నందికొట్కూర్ లో 25,560 మందికి రు.33.22 కోట్లు, నంద్యాలలో 26,580 మందికి రు.34.55 కోట్లు, పాణ్యంలో 8536 మందికి రు.11.09 కోట్లు, శ్రీశైలంలో 22,932 మందికి రు.29.81 కోట్లు వెరసి మొత్తం 1,67,084 మంది విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో రు.217.20 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ హితబోధ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు…. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్, మార్క్ ఫెడ్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ తదితరుల చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News