Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌, మాధురికి పోలీసుల నోటీసులు

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌, మాధురికి పోలీసుల నోటీసులు

Duvvada Srinivas| కొన్ని నెలలుగా తమ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి(Divvala Madhuri)కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల వీరిద్దరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ప్రధాన ఆలయం ముందు మీడియాతో తాము సహజీవనం చేస్తున్నామని చెప్పడంతో పాటు త్వరలోనే పెళ్లిచేసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా పవిత్రమైన మాఢ వీధుల్లో రీల్స్, వీడియోలు చేస్తూ కనిపించారు.

- Advertisement -

అయితే దీనిపై ఆగ్రహించిన భక్తులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ తిరమల పోలీసులకు ఫిర్యాదుచేశారు. అధికారుల ఫిర్యాదుతో BNS 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది. దీంతో టెక్కలి చేరుకున్న తిరుమల పోలీసులు విచారణకు రావాంటూ ఇద్దరికీ నోటీసులు‌ జారీచేశారు.

కాగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కొంతకాలంగా టెక్కలిలోని ఆయన నివాసంలో ఉంటున్నారు. అయితే తమ ఇంట్లో మాధురితో ఉండటం సహించలేని ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు నిరసనకు దిగారు. తమ ఇంటి నుంచి మాధురి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇల్లు తన పేరిట దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారంటూ మాధురి పేపర్లు చూపించింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఈ క్రమంలోనే తామిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా వీరిద్దరి వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad