YSRCP Press Release: వైయస్సార్ సీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ కీలక నే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్‌లో ఇద్దరు వైసీపీ నేతలను సస్పెండ్ చేశారు. వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా వారిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇద్దరు నేతలు వైసీపీలో ఫస్ట్ నుంచి కీలకంగా వ్యవహరించారు.
ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ.. రాబోయే 2029 ఎన్నికల్లో వైసీపీ తరఫున హిందూపూర్‌లో తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే ఈ నియోజకవర్గానికి ఇంఛార్జ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న దీపిక.. ఇదే విషయమై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సీరియస్ గా తీసుకున్నా వైసీపీ అధిష్టానం కీలక నేతలను సస్పెండ్ చేసింది.


