The Paradise: నాని ది ప్యారడైజ్.. పాన్ ఇండియా మూవీ కాదట. పాన్ వరల్డ్ సినిమాగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం హాలీవుడ్‌లో అవతార్ వంటి సినిమాలకు ప్రమోషన్స్ అందించిన కనెక్ట్ మోబ్‌సీస్ సంస్థతో డీల్ కుదర్చుకోనున్నట్లు సమాచారం.
అవతార్, డ్యూన్…
హాలీవుడ్‌లో అవతార్, డ్యూన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జూరాసిక్ వరల్డ్‌తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలకు మార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం పని చేసింది కనెక్ట్ మోబ్‌సీస్. అలాంటి దిగ్గజ సంస్థతో కొలాబరేట్ అవుతోంది ది ప్యారడైజ్ మూవీ టీమ్. ప్యారడైజ్‌ను భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్, మార్కెటింగ్ కోసం కనెక్ట్ మోబ్‌సీస్‌తో డీల్ చేసుకుంటున్నారట మూవీ టీమ్. ఈ సంస్థ ప్రతినిధి అలెగ్జాండ్రాను ది ప్యారడైజ్ మేకర్స్ కలిసినట్లు సమాచారం.
హాలీవుడ్ యాక్టర్…
ది ప్యారడైజ్ ప్రమోషన్స్ కోసం ఇండియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. ఆ యాక్టర్ ఎవరన్నది తొందరలోనే రివీల్ కానున్నట్లు తెలిసింది. దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ కోసం నాని అభిమానులతో పాటు తెలుగు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జడల్‌గా నాని…
నాని ఇమేజ్‌కు భిన్నంగా యాక్షన్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో నాని జడల్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం నాని ట్రాన్స్‌ఫర్మెషన్, మేకోవర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో కిల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read- Ram Charan: సరికొత్త జానర్‌లో రామ్‌చరణ్ మూవీ – సుకుమార్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్!
పెద్దితో పోటీ…
ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్‌ను ఇప్పటికే మేకర్స్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. రామ్‌చరణ్ పెద్దితో బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతుంది. ప్యారడైజ్ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్… మొత్తం ఎనిమిది భాషల్లో ప్యారడైజ్ విడుదల కాబోతుంది.


