Shukra surya yuti in kanya Rashi 2025:గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభకరమైన రాజయోగాలను ఏర్పరుస్తాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశిచక్ర గుర్తులపై ఉంటుంది. ఆనందం, ఐశ్వర్యం ఇచ్చే శుక్రుడు రేపు(అక్టోబర్ 9) కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే అదే రాశిలో గ్రహాల రాజు అయిన సూర్యుడు సంచరిస్తున్నాడు. కన్యారాశిలో వీరిద్దరి కలయిక వల్ల అరుదైన నీచభంగం రాజయోగం రూపొందుతోంది. ఈ యోగ ప్రభావం కారణంగా మూడు రాశులవారు కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్యా రాశి
ఇదే రాశిలో నీచభంగ రాజయోగం ఏర్పడబోతుంది. మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కెరీర్ లో గ్రోత్ ఉంటుంది. కొన్ని పనులకు అనుకున్న టైంకు పూర్తవుతాయి. బిజినెస్ చేసేవారు ఎన్నో లాభాలను గడిస్తారు. ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి.
తులా రాశి
నీచభంగ రాజయోగం తులా రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ కెరీర్ లో మంచి ఎత్తుకు చేరుకుంటారు. సంసార జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. మీ చింతలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది.
Also Read: Govardhan Puja 2025 – గోవర్ధన పూజ ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న కథ ఏంటో తెలుసా?
వృశ్చిక రాశి
శుక్ర,సూర్యల నీచభంగ రాజయోగం వృశ్చిక రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టుతో ఎలాంటి కార్యనైనా సులుభంగా సాధించగలుగుతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు బాగుంటాయి.
Disclaimer: ఈ కథనం సంపూర్ణంగా నిజమైనదని మేము ఖచ్చితంగా చెప్పలేము. దీనిని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


