సూరారం కాలనీలోని స్వామి వివేకానంద పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. పిల్లలు వినూత్నమైన ఆలోచనతో చేసినటువంటి ప్రాజెక్టులతో తల్లిదండ్రులను, కాలనీ వాసులను ఆకట్టుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కొండేటి నర్సిరెడ్డి మాట్లాడుతూ పిల్లలలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బయటకు తీయాలని, చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్బహించామన్నారు.
- Advertisement -
ఈ విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి, దేశానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు పాల్గొని పిల్లలను అభినందించి, ఆశీర్వదించారు.