Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: రజనీకాంత్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

Chandrababu: రజనీకాంత్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

Chandrababu|సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్‌(Rajinikanth)పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘‘నా ప్రియ మిత్రుడు, లెజెండరీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి. భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు అందుకోవాలి’’ అని ఆకాంక్షించారు.

- Advertisement -

కాగా చంద్రబాబు, రజనీకాంత్ మంచి స్నేహితులు అని తెలిసిందే. మూడు దశాబ్దాలకు పైగా వీరి మధ్య సన్నిహత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా రజనీ హాజరయ్యారు. అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాల కార్యక్రమానికి కూడా రజనీ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయకత్వంపై రజనీ ప్రశంసలు కురిపించడంతో వైసీపీ నేతలు ఆయనపై నోరుజారిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News