Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Karimnagar: తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా?

Karimnagar: తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా?

వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు అంతే ప్రాధాన్యత ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని 2004లో మాట ఇచ్చిన సోనియా గాంధీ తన మాట నిలబెట్టుకున్నారని రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులను, నిరుద్యోగులను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నానని రేవంత్ అన్నారు. ఎంపీలుగా ఇక్కడే గెలిచిన కేసీఆర్, తన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారు? పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా? కేసీఆర్ వచ్చాక కొత్తగా 3,000 వైన్ షాపులు, 60,000 బెల్టు షాపులు వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News